నేపాల్‌ సరిహద్దుల్లో ఉగ్ర టెన్షన్… - Digital Prime News

నేపాల్‌ సరిహద్దుల్లో ఉగ్ర టెన్షన్…

Homeఅంతర్జాతీయం

నేపాల్‌ సరిహద్దుల్లో ఉగ్ర టెన్షన్…

లష్కరే తోయిబా ఉగ్రవాదికి మోతే.. పాక్‌లో సైఫుల్లా ఖలీద్ హత్య. ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై భారత్‌ కొనసాగిస్తున్న ఆపరేషన్ సింధూర్ ఫలితాలిచ్చేస్త

జమ్ముకశ్మీర్‌: పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్…
పాకిస్తాన్ మరో షాక్..
ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా.. హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్‌ కుట్ర?

లష్కరే తోయిబా ఉగ్రవాదికి మోతే.. పాక్‌లో సైఫుల్లా ఖలీద్ హత్య.
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై భారత్‌ కొనసాగిస్తున్న ఆపరేషన్ సింధూర్ ఫలితాలిచ్చేస్తోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి కుట్రలో కీలకంగా ఉన్న లష్కరే తోయిబా టెర్రరిస్ట్ అబూ సైఫుల్లా ఖలీద్ పాకిస్తాన్‌లో హత్యకు గురయ్యాడు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చిచంపారు.
సైఫుల్లా ఖలీద్ గతంలో నాగ్‌పూర్, రాంపూర్, బెంగళూరులో జరిగిన ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించాడు. ఇతడు ఫేక్ ఐడీ ద్వారా నేపాల్‌లో ‘వినోద్ కుమార్’ పేరుతో జీవించి, అక్కడ ఇస్లామియా జమాత్‌ పేరుతో టెర్రర్ శిబిరాలు నిర్వహించేవాడు.
భారత్‌కు వ్యతిరేకంగా పలు కుట్రలు పన్నిన ఖలీద్, 10 పాకిస్తానీ, 27 బంగ్లాదేశీ ఉగ్రవాదులతో కలిసి నెట్‌వర్క్‌ను ఏర్పరచాడు. వీరంతా ప్రస్తుతం నేపాల్-భారత్ సరిహద్దుల గుండా చొరబాటుకు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
భద్రతా బలగాలు అప్రమత్తమై నేపాల్ సరిహద్దుల్లో 20 కిలోమీటర్ల పరిధిలో తనిఖీలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే 20 మంది విదేశీ అనుమానితులు పట్టుబడగా, వారిలో కెనడా, చైనా పౌరులు ఉన్నట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది కశ్మీరీ సింగ్నూ నేపాల్‌లో అరెస్ట్‌ చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube