వారం రోజుల్లో 29% పెరిగిన రూ.10 లోపల స్టాక్స్! - Digital Prime News

వారం రోజుల్లో 29% పెరిగిన రూ.10 లోపల స్టాక్స్!

Homeబిజినెస్

వారం రోజుల్లో 29% పెరిగిన రూ.10 లోపల స్టాక్స్!

స్టాక్ మార్కెట్ జోష్‌ – సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ముగింపు, 7 స్టాక్స్ డబుల్ డిజిట్ రిటర్న్స్ ముంబయి, మే 25: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం

భారీ లాభాల్లో ఆటో షేర్లు.. కారణమిదే…
ఈ వారం మార్కెట్ దృష్టి జీడీపీ డేటా, గ్లోబల్ అంశాలపై…
భారీగా తగ్గిన బంగారం ధర….

స్టాక్ మార్కెట్ జోష్‌ – సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ముగింపు, 7 స్టాక్స్ డబుల్ డిజిట్ రిటర్న్స్
ముంబయి, మే 25:
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ లాభాల్లో ముగించాయి. ముఖ్యంగా సెన్సెక్స్ 769 పాయింట్లు (0.95%) పెరిగి 81,721 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు (0.99%) లాభపడి 24,853 వద్ద స్థిరపడ్డాయి. గత వారం మార్కెట్లు ఒడిదుడుకులతో ట్రేడ్ అయినా, కొన్ని స్టాక్స్ మాత్రం బలమైన వృద్ధిని నమోదు చేశాయి.
ప్రత్యేకంగా 7 స్టాక్స్ గత వారం రోజుల్లో డబుల్ డిజిట్ లాభాలను ఇన్వెస్టర్లకు అందించాయి. వీటిలో అవాన్సీ టెక్నాలజీస్, ప్రాక్సిస్ హోమ్స్ రిటైల్ లిమిటెడ్ వంటి Penny Stocks ముందున్నారు. అవాన్‌సీ టెక్నాలజీస్ షేర్‌ 29% పెరగగా, ప్రాక్సిస్ హోమ్స్ షేర్‌ 27% పెరిగింది.
గత వారం అత్యధిక లాభాలన్నీ అందించిన స్టాక్స్:
అవాన్సీ టెక్నాలజీస్ లిమిటెడ్ – 29% లాభం, చివరి రేటు: ₹0.85, మార్కెట్ క్యాప్: ₹168.46 కోట్లు
ప్రాక్సిస్ హోమ్స్ రిటైల్ లిమిటెడ్ – 27% లాభం, చివరి రేటు: ₹14.16, మార్కెట్ క్యాప్: ₹261.25 కోట్లు
సెల్విన్ ట్రేడ్స్ లిమిటెడ్ – 17% లాభం, చివరి రేటు: ₹3.44, మార్కెట్ క్యాప్: ₹77.36 కోట్లు
ఐఎఫ్ఎల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ – 14% లాభం, చివరి రేటు: ₹0.80, మార్కెట్ క్యాప్: ₹60 కోట్లు
ఇండియా స్టీల్ వర్క్స్ లిమిటెడ్ – 12% లాభం, చివరి రేటు: ₹6.16, మార్కెట్ క్యాప్: ₹243.63 కోట్లు
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ – 10% లాభం, చివరి రేటు: ₹3.64, మార్కెట్ క్యాప్: ₹176 కోట్లు
గ్రోయింగ్ టన్ వెంచర్స్ ఇండియా లిమిటెడ్ – 10% లాభం, చివరి రేటు: ₹1.85, మార్కెట్ క్యాప్: ₹121.74 కోట్లు
గత వారం మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగినా, ఈ చిన్న కాప్ స్టాక్స్ పెట్టుబడిదారులకు బలమైన రాబడులను అందించాయి. రానున్న రోజుల్లో మార్కెట్ దిశ ఎలా ఉండబోతుందన్నది కీలకంగా మారనుంది.

DP Infra Marketing instagram post

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube