ఛార్ ధామ్ యాత్ర నేపథ్యంలో కేదార్‌నాథ్ ధామ్ యాత్రకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. అయితే ఈ పుణ్యయాత్రలో తీసుకెళ్లకూడని వస్తువులు, పాటించవలసిన నియమాల
ఛార్ ధామ్ యాత్ర నేపథ్యంలో కేదార్‌నాథ్ ధామ్ యాత్రకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. అయితే ఈ పుణ్యయాత్రలో తీసుకెళ్లకూడని వస్తువులు, పాటించవలసిన నియమాలు గురించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
మాంసాహారం, చేపలు, గుడ్లు వంటి వస్తువులు మతపరంగా నిషేధించబడ్డాయి. పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్, పాలిథిన్ వస్తువులపై పూర్తిగా నిషేధం విధించారు. మద్యం లేదా ఇతర మాదకద్రవ్యాలు తీసుకెళ్లడంపై కూడా కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అలాగే, అనుమతి లేకుండా డ్రోన్ వాడకం నిషిద్ధం. ఈ యాత్ర కఠినమైనదై ఉండటం వల్ల భారం తగ్గించుకునేందుకు అవసరంలేని వస్తువులను తీసుకెళ్లకూడదని, ఘాటు వాసన కలిగిన పరిమళ ద్రవ్యాలు, శబ్దం చేసే లౌడ్ స్పీకర్లను కూడా తీసుకెళ్లకూడదని సూచించారు.
కేదార్‌నాథ్ ఆలయం ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుతూ, భక్తుల ఆధ్యాత్మిక యాత్ర సాఫీగా సాగేందుకు ఈ నియమాలు అమలవుతాయని అధికారులు తెలిపారు.
Arukaleoverseas consultancy – instagram post

COMMENTS