హైదరాబాద్, మే 16: తెలంగాణలో రాజకీయ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు
హైదరాబాద్, మే 16: తెలంగాణలో రాజకీయ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
“ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకున్నందుకు శుభాకాంక్షలు,” అంటూ విమర్శించిన కేటీఆర్, ప్రస్తుతం తెలంగాణలో కమీషన్ సర్కార్ నడుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కమీషన్లు తీసుకోకుండా సంతకాలు చేయరని, ఏకంగా 30 శాతం కమీషన్లతో ప్రభుత్వ యంత్రాంగం నడుస్తోందని ఆరోపించారు.
కాంట్రాక్టర్లే కమీషన్ల దందాను బయటపెట్టారంటూ, కొండా సురేఖ పేరు ప్రస్తావించిన కేటీఆర్, “కమీషన్లు తీసుకున్న వారి పేర్లను మంత్రి బయటపెట్టాలి,” అని డిమాండ్ చేశారు. అంతేకాక, ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగలదా? అని కూడా ప్రశ్నించారు.
COMMENTS