ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ రూల్స్‌లో కీలక మార్పులు…. - Digital Prime News

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ రూల్స్‌లో కీలక మార్పులు….

Homeజాబ్స్ & ఎడ్యుకేషన

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ రూల్స్‌లో కీలక మార్పులు….

న్యూఢిల్లీ: అసెస్మెంట్ ఇయర్ 2025–26 (ఆర్థిక సంవత్సరం 2024–25)కు సంబంధించి ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) రిటర్న్లను ఫైల్ చేసే వారికి కీలక సూచన. ఆదాయప

421 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు…… 
త్వరలో 12 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ? 
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటినుంచి ప్రారంభం….

న్యూఢిల్లీ: అసెస్మెంట్ ఇయర్ 2025–26 (ఆర్థిక సంవత్సరం 2024–25)కు సంబంధించి ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) రిటర్న్లను ఫైల్ చేసే వారికి కీలక సూచన. ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ వాలిడేషన్ నిబంధనల్లో 7 కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఐటీఆర్-1, ఐటీఆర్-4 యుటిలిటీలు మాత్రమే విడుదల చేశారు. ఈ మార్పులు ముఖ్యంగా వేతన జీవులపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ఎలక్ట్రిక్ వెహికల్ లోన్, హోమ్ లోన్, హౌస్ రెంట్ వంటి డిడక్షన్లను క్లెయిమ్ చేయాలంటే కీలకమైన సమాచారం తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఫిజికల్ వెరిఫికేషన్ ఆధారంగా క్లెయిమ్ చేస్తే, ఇప్పుడు ఆటోమేటెడ్ వెరిఫికేషన్ జరుగుతుంది.
హెచ్ఆర్ఏ (House Rent Allowance)లో మార్పు:
హెచ్ఆర్ఏ మినహాయింపు పొందాలంటే ఉద్యోగం చేసే ప్రదేశం, రెంటు, బేసిక్ శాలరీ, డీఏ తదితర వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
సెక్షన్ 80సీ:
డిడక్షన్ క్లెయిమ్ చేయాలంటే పాలసీ నంబర్ లేదా డాక్యుమెంట్ ఐడీ తప్పకుండా ఇవ్వాలి.
సెక్షన్ 80డీ:
ఆరోగ్య బీమా డిడక్షన్ కోసం కంపెనీ పేరు, పాలసీ నంబర్ వివరాలు ఇవ్వాలి.
సెక్షన్ 80ఈ:
విద్యా రుణాలపై వడ్డీ మినహాయింపుకు బ్యాంకు వివరాలు, లోన్ డీటెయిల్స్ తప్పనిసరి.
సెక్షన్ 80ఈఈ / 80ఈఈఏ:
హోమ్ లోన్ డిడక్షన్ కోసం బ్యాంకు పేరు, లోన్ అకౌంట్ నంబర్, మంజూరు తేదీ, లోన్ మొత్తం వివరాలు అవసరం.
సెక్షన్ 80ఈఈబీ:
ఎలక్ట్రిక్ వెహికల్ లోన్ పై వడ్డీ మినహాయింపు కోసం రుణం సంబంధిత వివరాలు ఇవ్వాలి.
సెక్షన్ 80డీడీబీ:
ప్రత్యేక వ్యాధుల చికిత్సపై డిడక్షన్ కోసం వ్యాధి పేరు, చికిత్స స్థలం వివరాలు తప్పనిసరి.

citricare service center- instagram video

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube