తీర్థయాత్రలకు వెళ్లాలనే కోరిక చాలా మందికి ఉన్నప్పటికీ అధిక ఖర్చుల కారణంగా చాలామంది ఆ ఆలోచనను వాయిదా వేస్తుంటారు. అలాంటి భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్
తీర్థయాత్రలకు వెళ్లాలనే కోరిక చాలా మందికి ఉన్నప్పటికీ అధిక ఖర్చుల కారణంగా చాలామంది ఆ ఆలోచనను వాయిదా వేస్తుంటారు. అలాంటి భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక సదుపాయం తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించేలా “సర్క్యులేటింగ్ జర్నీ టికెట్” (Circular Journey Ticket) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ రైల్వే ప్రయాణ ఛార్జీలతో పోల్చితే సుమారు 25 శాతం తక్కువ ధరలో ఈ టికెట్ లభించడం విశేషం.
ఈ ప్రత్యేక టికెట్ ద్వారా ఒకే ప్రయాణంలో అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి మొత్తం 19 తీర్థయాత్ర మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నాంపల్లి నుంచి మంత్రాలయం, తిరుపతి, బెంగళూరు, చెన్నై, భద్రాచలం వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. సికింద్రాబాద్ నుంచి బీజాపూర్, కొల్హాపూర్, వాస్కోడిగామా, మైసూర్, తిరుపతి వంటి ప్రముఖ ప్రాంతాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. అలాగే కాచిగూడ నుంచి ఔరంగాబాద్, ఉజ్జయినీ, మైసూర్, హుబ్లీ ప్రాంతాలు కూడా యాత్రలో భాగంగా ఉన్నాయి.
ఇంకా భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి పూరి, హౌరా, వారణాసి, రిషికేష్, ఢిల్లీ, ముంబయి వంటి దేశవ్యాప్తంగా ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రయాణించవచ్చు. ఒకే టికెట్‌తో గరిష్ఠంగా 8 బ్రేక్ జర్నీలు చేసుకునే అవకాశం రైల్వే కల్పించింది. ప్రయాణ గడువు గరిష్ఠంగా 56 రోజులు ఉండగా, అది మొత్తం ప్రయాణ దూరాన్ని బట్టి మారుతుంది.
వృద్ధులకు ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటించారు. పురుషులకు 40 శాతం, మహిళలకు 50 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడం భక్తులకు మరింత ప్రయోజనకరం. టికెట్ తీసుకున్న తర్వాత విడిగా రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. బెర్త్ లభ్యత రైల్వే నిబంధనల ప్రకారం ఉంటుంది.
ఈ టికెట్లను బుక్ చేసుకోవాలంటే సంబంధిత స్టేషన్లలోని డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లేదా చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ కార్యాలయాలను సంప్రదించాలి. ముఖ్యంగా నాన్-సీజన్ సమయంలో 60 రోజుల ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఈ సదుపాయం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS