ప్రముఖ నటుడు కన్నుమూత…..  - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ప్రముఖ నటుడు కన్నుమూత….. 

Homeజాతీయం

ప్రముఖ నటుడు కన్నుమూత….. 

మలయాళ నటుడు విష్ణుప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. చిక

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ రూ.170కోట్లు? 
హిట్-3: తొలి రోజు రూ.43 కోట్ల కలెక్షన్స్….
కన్నప్ప డే వన్ వసూళ్లు.. వరల్డ్ వైడ్‌గా ఎంత కలెక్ట్ చేశాడో తెలుసా?

మలయాళ నటుడు విష్ణుప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. చికిత్స కోసం డబ్బులు అవసరం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, మలయాళ టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కలిసి విరాళాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు అభిరామి, అనానిక ఉన్నారు.
విష్ణుప్రసాద్ తమిళ చిత్రం ‘కాశి’తో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మలయాళంలో ‘రన్వే’, ‘లయన్’, ‘బెన్ జాన్సన్’, ‘కాయ్ ఎతుమ్ దూర్త్’, ‘లోకనాథన్ ఐఏఎస్’ వంటి పలు చిత్రాల్లో విలన్‌గా, ఇతర ముఖ్య పాత్రల్లో నటించి గుర్తింపు పొందారు. ఆయన మలయాళ టెలివిజన్ సీరియల్స్‌లో కూడా చాలా పాపులర్.
ఆయన మరణం పట్ల మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు నటీనటులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో సంతాప సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు రేపు (మే 3) జరగనున్నాయి.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube