ఇండియాలో నకిలీ ఎంబసీ.. అసలు ఆ దేశమే లేదు! ఘరానా మోసగాడి హర్షవర్ధన్ జైన్ అరెస్ట్.

ఇండియాలో నకిలీ ఎంబసీ.. అసలు ఆ దేశమే లేదు! ఘరానా మోసగాడి హర్షవర్ధన్ జైన్ అరెస్ట్.

Homeజాతీయం

ఇండియాలో నకిలీ ఎంబసీ.. అసలు ఆ దేశమే లేదు! ఘరానా మోసగాడి హర్షవర్ధన్ జైన్ అరెస్ట్.

అసలు ఆ దేశమే లేదు... కానీ, ఇండియాలో ఎంబసీ! ఘరానా మోసగాడి హర్షవర్ధన్ జైన్ అరెస్ట్ ఘరానా మోసానికి తెరతీసిన ఓ కేటుగాడి గుట్టురట్టు చేశారు ఉత్తరప్రదేశ్ ట

BrahMos Attack: భారత్ బ్రహ్మోస్ దాడిపై స్పందించేందుకు 30 సెకన్లు కూడా కాలేదు – పాక్‌ ఆర్మీ వేదన.
సంచార్ సాథీ తప్పనిసరి ఆదేశాలు వెనక్కి తీసుకున్న కేంద్రం
నోబెల్ శాంతి బహుమతి 2025: ట్రంప్‌పై ప్రపంచం దృష్టి

అసలు ఆ దేశమే లేదు… కానీ, ఇండియాలో ఎంబసీ! ఘరానా మోసగాడి హర్షవర్ధన్ జైన్ అరెస్ట్

ఘరానా మోసానికి తెరతీసిన ఓ కేటుగాడి గుట్టురట్టు చేశారు ఉత్తరప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. నకిలీ దేశానికి నకిలీ ఎంబసీ! ఏకంగా (లేనిది) దేశానికి ఇండియాలో ఎంబసీ ఏర్పాటు చేసి, దౌత్య పాస్‌పోర్టులు సృష్టించి, ఖరీదైన కార్లపై దౌత్య నంబర్లను వేయించి, ప్రభుత్వంతో సంబంధాలున్నట్టు నటించి భారీ మోసాలకు పాల్పడ్డాడు.

ఢిల్లీకి సమీపంలోని ఘాజియాబాద్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడు హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి ఓ పెద్ద బంగ్లాను అద్దెకు తీసుకుని దాన్ని “వెస్ట్ ఆర్కిటికా ఎంబసీ”గా మార్చాడు. వాస్తవానికి “వెస్ట్ ఆర్కిటికా” అనే దేశమే లేదు! ఇది అంటార్కిటికాలో ఉన్న ఒక ప్రాంతానికి ఒకప్పుడు ఒక అమెరికా నౌకాదళ అధికారి ట్రావిస్ మెక్‌హెన్రీ స్వయంగా దేశంగా ప్రకటించుకున్నప్పుడు పుట్టిన కల్పిత దేశం మాత్రమే.

నకిలీ డిప్లొమాటిక్ డ్రామా

హర్షవర్ధన్ జైన్ తాను దౌత్య ప్రతినిధినని చెప్పుకుంటూ ప్రముఖ నాయకులతో దిగిన ఫేక్ ఫోటోలు చూపించేవాడు. సామాజిక మాధ్యమాల్లో తనను “వెస్ట్ ఆర్కిటికా రిపబ్లిక్”కు చెందిన అధికారి, సంపన్నుడు అనే ముసుగులో చూపించేవాడు. తాను 2017 నుంచి ఎంబసీ నడుపుతున్నట్లు, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రచారం చేశాడు.

ఈ నకిలీ ఎంబసీలో దౌత్య పాస్‌పోర్టులు, విదేశాంగ శాఖ స్టాంపులతో ఉన్న పత్రాలు, వివిధ దేశాలకు సంబంధించిన నకిలీ సీల్‌లు, 12 దేశాలకు చెందిన డిప్లొమాటిక్ పాస్‌పోర్టులు, 34 దేశాల స్టాంపులు, రూ. 44 లక్షల నగదు, ఖరీదైన కార్లు, దౌత్య నంబర్‌ప్లేట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గతంలోనూ కేసులు

ఇది జైన్‌కు మొదటి మోసం కాదు. 2011లో శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నాడని అతనిపై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఎంబసీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో పోలీసులు అనుమానం వచ్చి విచారించగా అసలైన విషయాలు వెలుగుచూశాయి.

అసలు వెస్ట్ ఆర్కిటికా అంటే ఏంటి?

2001లో ట్రావిస్ మెక్‌హెన్రీ అనే అమెరికా నేవీ అధికారి, అంటార్కిటికాలోని 6,20,000 చదరపు మైళ్ల ప్రాంతాన్ని “వెస్ట్ ఆర్కిటికా” దేశంగా ప్రకటించాడు. తనను తాను ఆ దేశపు రాజుగా ప్రకటించుకున్నాడు. అయితే ఈ దేశానికి యునైటెడ్ నేషన్స్ సహా ఎవరూ గుర్తింపు ఇవ్వలేదు. శాంతియుత పరిశోధనలకే అంటార్కిటికాను ఉపయోగించాలన్న ఒప్పందం ఆధారంగా ట్రావిస్ loopholes వాడుకున్నాడు.

పోలీసుల వ్యాఖ్యలు

“తనను జేమ్స్ బాండ్ లా తలచుకొని డిప్లొమాట్ అన్న ముసుగులో నకిలీ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. కానీ చివరికి అడ్డంగా దొరికిపోయాడు,” అని పోలీసులు తెలిపారు.

Visit: www.digitalprimenews.in

Follow Us On:
Follow Us on Social Media:
▶️ YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube