అనంతపురం లో యువతి దారుణ హత్య….. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

అనంతపురం లో యువతి దారుణ హత్య…..

Homeఆంధ్రప్రదేశ్

అనంతపురం లో యువతి దారుణ హత్య…..

అనంతపురం జిల్లాలో జరిగిన యువతి హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్న తన్మయి అనే యువతి ఐదు రోజుల క్రితం అదృశ్యమై

మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా దౌర్జన్యం – బస్ కండక్టర్‌పై దాడి….
రాజమండ్రిలో యువకుడి ఆత్మహత్య: రైల్వే క్వార్టర్ సమీపంలో మృతదేహం లభ్యం
ఏపీ మద్యం వాడకంపై నివేదిక: రోజూ 50 లక్షల మందు!

అనంతపురం జిల్లాలో జరిగిన యువతి హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్న తన్మయి అనే యువతి ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ఘటన దురదృష్టకరంగా ముగిసింది. ఆదివారం మణిపాల్ స్కూల్ వెనుక ప్రాంతంలో అత్యంత దారుణమైన స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటనతో ఊరంతా షాక్‌కి గురయ్యింది.
తన్మయి మృతదేహం కనిపించడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఐదు రోజుల క్రితమే తమ కుమార్తె కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు స్పందించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. “పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నా మా అమ్మాయి ప్రాణాలతో ఉండేదేమో” అంటూ బాధిత తండ్రి గుండె పగిలేలా విలపించారు.
పోలీసుల కథనం ప్రకారం, తన్మయికి ముగ్గురు యువకులతో పరిచయం ఉన్నట్టు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి కూడేరు మండల పరిధిలోని మణిపాల్ స్కూల్ వెనుక బీర్ బాటిల్‌తో ఆమె తలపై బలంగా బాదడం వల్ల మరణించినట్లు తేలింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ – “తన్మయి హత్య ఘటన మనసును కలచివేసింది. దుండగులు రాక్షసుల్లా మృతదేహాన్ని తగులబెట్టిన తీరు చూస్తే కలచిపోతుంది. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. బాధిత కుటుంబానికి మేము అండగా నిలుస్తాం” అని పేర్కొన్నారు.
ప్రస్తుతానికైతే పోలీసులు హత్యకు గల కారణాలు, వ్యక్తిగత పరమైన అనుమానాలు మరియు నిందితుల వైఖరి తదితర అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube