హైదరాబాద్‌లో జాబ్ స్కామ్ అలర్ట్. CamelQ Software Solutions పేరుతో మోసం.. కొత్తగా "MU Tech" పేరుతో మళ్లీ ప్రారంభం? హైదరాబాద్‌లో ఉద్యోగాల
Newer Post
హైదరాబాద్‌లో జయలలిత భవనం సీజ్.. GHMC చర్యలు హైదరాబాద్‌లో జాబ్ స్కామ్ అలర్ట్. CamelQ Software Solutions పేరుతో మోసం.. కొత్తగా "MU Tech" పేరుతో మళ్లీ ప్రారంభం? హైదరాబాద్‌లో ఉద్యోగాల
హైదరాబాద్‌లో ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఎరుకుల మహేష్ అనే వ్యక్తి CamelQ Software Solutions Pvt Ltd పేరుతో కంపెనీ ప్రారంభించి నిరుద్యోగులను మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
బాధితుల వివరాల ప్రకారం, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నెలల తరబడి జీతాలు చెల్లించలేదని, అడిగితే “ఇంకా 2–3 రోజుల్లో చెల్లిస్తాం” అంటూ మోసం చేస్తూ వచ్చారని తెలిపారు. అయితే తాజాగా కంపెనీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా మూసివేయబడింది. దీంతో డబ్బులు చెల్లించిన అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇదే వ్యక్తి ఇప్పుడు కొత్తగా MU Tech అనే పేరుతో మరో కంపెనీ ప్రారంభించి మళ్లీ అదే విధంగా మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అమాయక విద్యార్థులు, ఉద్యోగార్థులు ఈ మోసానికి బలికాకుండా అప్రమత్తంగా ఉండాలని బాధితులు కోరుతున్నారు.
ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయం VC Sajjanar మరియు హైదరాబాద్ సిటీ పోలీసుల దృష్టికి వెళ్లేలా సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరుతున్నారు. తమకు న్యాయం జరిగి, డబ్బులు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News తో కలసి ఉండండి!
COMMENTS