నల్గొండ, సూర్యాపేటలో 156 ఎలక్ట్రిక్ బస్సులు నిలిచిపోయాయి

నల్గొండ, సూర్యాపేటలో 156 ఎలక్ట్రిక్ బస్సులు నిలిచిపోయాయి

Homeతెలంగాణ

నల్గొండ, సూర్యాపేటలో 156 ఎలక్ట్రిక్ బస్సులు నిలిచిపోయాయి

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నిలిచిపోయాయిప్రభుత్వం కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను అందజేసినా, డ్రైవర్ల కొరతతో అవి డిపోల

మావోయిస్టు కీలక నేత ఆజాద్ లొంగుబాటు? తెలంగాణలో సంచలనం.
సహచర ఎమ్మెల్యే మరణం మధ్య వివేక్ ఇంట్లో సంబరాలు….
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025: నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపు.

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నిలిచిపోయాయి
ప్రభుత్వం కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను అందజేసినా, డ్రైవర్ల కొరతతో అవి డిపోలకే పరిమితమవుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 156 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించినప్పటికీ, తక్కువ జీతాలు, అధిక పని ఒత్తిడి కారణంగా డ్రైవర్లు ఆసక్తి చూపడం లేదు. కొంతమంది డ్రైవర్లు శిక్షణ తీసుకున్న తర్వాతే ఉద్యోగం వదిలి వెళ్లిపోతుండడంతో RTCకి ఈ సమస్య ప్రధాన సవాలుగా మారింది.

జేబీఎం సంస్థ ఆధ్వర్యంలో బస్సుల నిర్వహణ జరుగుతుండగా, అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా డ్రైవర్లకు సుమారు రూ. 22,000 మాత్రమే జీతం అందుతోంది. ప్రస్తుతం ప్రైవేట్ డ్రైవింగ్ పనుల్లో రోజువారీగా ఎక్కువ ఆదాయం వస్తుండడంతో RTC ఎలక్ట్రిక్ బస్సులపై ఆసక్తి తగ్గిపోతోంది. పైగా, అదనపు కిలోమీటర్ల ఒత్తిడి, రోజుకు 14 గంటల విధులు, డీలక్స్ బస్సులపై రూ.30 వేల టార్గెట్ కారణంగా డ్రైవర్లు మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నామని వాపోతున్నారు.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణలు, కామెంటరీ కోసం మా వెబ్‌సైట్ మరియు యూట్యూబ్ చానెల్‌ను ఫాలో అవ్వండి.

Visit: www.digitalprimenews.in

Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube