సిగాచీ ఘ‌ట‌న‌పై అధికారిక ప్రకటన: మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం

సిగాచీ ఘ‌ట‌న‌పై అధికారిక ప్రకటన: మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం.

Homeతెలంగాణ

సిగాచీ ఘ‌ట‌న‌పై అధికారిక ప్రకటన: మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం.

హైదరాబాద్, జూలై 2: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కెమికల్స్ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంపై సంస్థ తాజాగా ఆధికారిక ప్రకటన విడుదల చేసింది. కంపెన

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థ ప్రారంభం.
పవన్ కళ్యాణ్ ఫోటో పిల్‌పై సుప్రీంకోర్టు సీరియస్
ఏడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో చారిత్రాత్మక విజయం: ఆకాశ్ దీప్ 10 వికెట్లు, భారత తొలి గెలుపు.

హైదరాబాద్, జూలై 2:

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కెమికల్స్ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంపై సంస్థ తాజాగా ఆధికారిక ప్రకటన విడుదల చేసింది. కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ స్టాక్ మార్కెట్లకు పంపిన లేఖలో ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ విషాద ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే 33 మంది కార్మికులు గాయపడ్డారు. మృతుల కుటుంబాల పరంగా రూ. కోటి చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు, వారి కుటుంబ పోషణ బాధ్యతను కూడా పరిశ్రమ భరించనుందని తెలిపారు.

“గాయపడిన ప్రతి కార్మికుడికి పూర్తిగా అండగా నిలబడతాం. అవసరమైన అన్ని రకాల బీమా క్లెయిమ్‌లను చెల్లిస్తాం. వారి చికిత్స ఖర్చులను పరిశ్రమే భరిస్తుంది,” అని వివేక్ కుమార్ స్పష్టం చేశారు.

అలాగే, ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడే కారణం కాదని తేల్చారు. దీనిపై ప్రభుత్వం చేపడుతున్న విచారణ నివేదిక కోసం పరిశ్రమ ఎదురుచూస్తోందని తెలిపారు. అప్పటివరకు అంచనాలు వేయకుండా అధికారిక నివేదిక ఆధారంగా పూర్తిస్థాయి సహకారం అందిస్తామని తెలిపారు.

భవిష్యత్‌ ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా, పరిశ్రమ కార్యకలాపాలను తాత్కాలికంగా మూడు నెలల పాటు (90 రోజులు) నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, పలు రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించగా, పరిశ్రమ తరఫున వచ్చిందీ ప్రకటన కొంత ఊరట కలిగించేదిగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube