మంచు విష్ణు కన్నప్ప డే 1 వసూళ్లు: వరల్డ్‌వైడ్‌గా ఎన్ని కోట్లు వచ్చాయంటే? మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ డ్రామా
మంచు విష్ణు కన్నప్ప డే 1 వసూళ్లు: వరల్డ్‌వైడ్‌గా ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘కన్నప్ప’ మొదటి రోజే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విశేష స్పందనను అందుకుంటోంది. దర్శకుడు ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విశ్వనటుడు మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ముకేశ్ రిషి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1600 థియేటర్లలో విడుదలైన ‘కన్నప్ప’ డే వన్ కలెక్షన్ల పరంగా రికార్డు స్థాయిలో ఆరంభాన్ని సాధించింది. టాక్ బాగున్న నేపథ్యంలో, ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్ ప్రేక్షకులు భారీగా థియేటర్లకు తరలివచ్చారు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘కన్నప్ప’ మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు సుమారు ₹11.6 కోట్లు (అంచనా) చేరినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ₹6.2 కోట్లు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కలిపి ₹3.8 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ₹1.6 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం, ఫైట్ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మంచి వసూళ్లు రావడం తో, వీకెండ్ కలెక్షన్లు మరింత భారీగా ఉండే అవకాశముంది. మంచు విష్ణు కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

COMMENTS