కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది – ఎన్ఆర్ఐల్లో ఉత్సాహం, అభిమానం వెల్లివిరిచిన సందడి. హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు (కే
కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది – ఎన్ఆర్ఐల్లో ఉత్సాహం, అభిమానం వెల్లివిరిచిన సందడి.
హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు (కేటీఆర్) విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. లండన్ మరియు అమెరికా పర్యటనల అనంతరం శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.
మే 27న హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ అదేరోజు లండన్ చేరుకుని ఎన్నారైలు, బీఆర్‌ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. మే 30న ‘బ్రిడ్జ్ ఇండియా వీక్-25’ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ అభివృద్ధి, బీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన సంక్షేమ విధానాలను ప్రపంచ ప్రతినిధులకు వివరించి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం వార్విక్ యూనివర్సిటీలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలతో పనిచేసే పీడీఎస్‌ఎల్ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించారు.
లండన్ పర్యటన ముగించిన కేటీఆర్ జూన్ 1న అమెరికాలోని డాలస్‌కు చేరుకున్నారు. ఫ్రిస్కోలోని కొમિકా సెంటర్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, బీఆర్‌ఎస్ 25వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వేలాది ఎన్‌ఆర్‌ఐలు పాల్గొని తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారు.
జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్, డాలస్‌లోని భారతీయ విద్యార్థులతో సమావేశమైన కేటీఆర్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. డాలస్ పర్యటనకు సంబంధించి ఆయన ట్విట్టర్ (ఎక్స్) లో పలు మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేశారు.
డాలస్‌లో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచిన శ్రావణి – ఉదయ్‌కుమార్‌రెడ్డి దంపతుల పిల్లలకు కేసీఆర్ పేర్లు పెట్టినట్టు తెలిపారు. అలాగే 2000 మైళ్ల దూరం కారులో ప్రయాణించి వచ్చి ప్రేమను చాటిన కిశోర్, గడ్డానికి గులాబీ రంగు వేసుకున్న ప్రవీణ్‌రెడ్డి కోలన్, శశాంక్ వెలగాల కుటుంబాలను ప్రత్యేకంగా అభినందించారు.
వారి సహకారం, మద్దతుతో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలు విజయవంతమయ్యాయని కేటీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సపోర్టర్లతో ఉన్న అనుబంధాన్ని ఈ పర్యటన మరోసారి ప్రదర్శించింది. దేశ విదేశాల్లో తెలంగాణ ప్రజలతో బంధాన్ని పటిష్టం చేయడంలో ఈ పర్యటన కీలకంగా నిలిచింది.

COMMENTS