మాజీమంత్రి దాడిశెట్టి రాజా: సీఐ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

మాజీమంత్రి దాడిశెట్టి రాజా: సీఐ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు….

Homeఆంధ్రప్రదేశ్

మాజీమంత్రి దాడిశెట్టి రాజా: సీఐ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు….

సీఐ సుబ్బారాయుడుపై ఆరోపణలు: మాజీమంత్రి విడుదల రజనీ పట్ల అమానుషంగా ప్రవర్తించిన తుని మండలం ఎస్ అన్నవరం సీఐ సుబ్బారాయుడుపై న్యాయ చర్యలు తీసుకోవాలని మాజీ

421 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు…… 
SLBC టన్నెల్ ప్రమాదం.. రెస్కూ ఆపరేషన్‌‌కు బ్రేక్….
రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేదు.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించండి – జగన్ సంచలన ట్వీట్!

సీఐ సుబ్బారాయుడుపై ఆరోపణలు: మాజీమంత్రి విడుదల రజనీ పట్ల అమానుషంగా ప్రవర్తించిన తుని మండలం ఎస్ అన్నవరం సీఐ సుబ్బారాయుడుపై న్యాయ చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. మహిళా మాజీమంత్రి అని కూడా చూడకుండా సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాపరిపాలన అభివృద్ధిపై కాకుండా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని దాడిశెట్టి రాజా విమర్శించారు.
వైసీపీ నేతలపై అన్యాయంగా కేసులు: వైసీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కన్వీనర్లపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల తీరుపై విమర్శ: తెల్లవారుజామున మహిళా వైసిపి ప్రజాప్రతినిధులు నైటీలో ఉన్నారని కూడా చూడకుండా పోలీసులు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాజ్యాంగం అమలుపై వ్యాఖ్యలు: రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందని దాడిశెట్టి రాజా అన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, ముందు ముందు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube