హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలపై యుద్ధ నీడలు - భద్రత సవాలు, కేంద్రం సూచనలకు అనుగుణంగా నిర్ణయం? హైదరాబాద్‌లో రేపటి నుంచి ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోట
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలపై యుద్ధ నీడలు – భద్రత సవాలు, కేంద్రం సూచనలకు అనుగుణంగా నిర్ణయం?
హైదరాబాద్‌లో రేపటి నుంచి ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభంకానున్న నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఈ పోటీల్లో పాల్గొనే విదేశీ ప్రతినిధులకు, అలాగే సామాన్యులకు భద్రత కల్పించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
దాదాపు మూడు వారాలపాటు జరగనున్న ఈ పోటీలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగడం అత్యంత ముఖ్యం. అయితే, పోటీల కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు, మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

COMMENTS