సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తాం-TGSRTC యాజమాన్యం…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తాం-TGSRTC యాజమాన్యం….

Homeతెలంగాణ

సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తాం-TGSRTC యాజమాన్యం….

తెలంగాణ ఆర్టీసీలో రేపటి నుంచి సమ్మె సైరన్: చర్చలకు ప్రభుత్వం పిలుపు, యాజమాన్యం ఎస్మా హెచ్చరిక తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో నెలకొన్న స

1500 ఎకరాల్లో డేటా సెంటర్ సిటీ.. హైదరాబాద్‌కు భారీ గుడ్‌న్యూస్!
సీఎం రేవంత్‌రెడ్డి నేటి షెడ్యూల్ వివరాలు….
‘తెలంగాణ మా జాగీరు కాదు.. భూమిపుత్రుల హక్కు’.. పవన్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్

తెలంగాణ ఆర్టీసీలో రేపటి నుంచి సమ్మె సైరన్: చర్చలకు ప్రభుత్వం పిలుపు, యాజమాన్యం ఎస్మా హెచ్చరిక
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) బుధవారం (రేపటి) నుంచి సమ్మెలోకి దిగడానికి సిద్ధమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా తమ 21 డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడం, పరిష్కార దిశగా చర్చలు జరగకపోవడంతోనే ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసు ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి తర్వాత నుంచే సమ్మె ప్రారంభం కానుంది. సమ్మెను విజయవంతం చేసేందుకు జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది.
ఆర్టీసీ సమ్మెను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కోరింది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం కొన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలను విన్న మంత్రి, వాటి పరిష్కారానికి తనతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. గత 16 నెలల ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి చేపట్టిన చర్యలను మంత్రి వివరించారు. రూ. 400 కోట్ల బాండ్‌ మొత్తం చెల్లింపు, రూ. 1039 కోట్ల పీఎఫ్‌ ఆర్టీనైజేసన్‌ బకాయిల చెల్లింపు, కారుణ్య నియామకాలు, 3038 కొత్త ఉద్యోగాల భర్తీ, తార్నాక ఆస్పత్రిని సూపర్‌ స్పెషాల్టీగా మార్చడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. సమ్మెకు పట్టుబట్టకుండా చర్చలకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ జేఏసీని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, ఆర్టీసీ యాజమాన్యం సమ్మె పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఎస్మా (Essential Services Maintenance Act) చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని యాజమాన్యం ప్రకటించింది. సమ్మె చట్టవిరుద్ధమని, సమ్మెలో పాల్గొనే ఉద్యోగులపై, విధులకు ఆటంకం కలిగించే వారిపై సంస్థ నిబంధనల మేరకు చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న తరుణంలో సమ్మె తీరని నష్టం కలిగిస్తుందని, తద్వారా సంస్థతో పాటు ఉద్యోగులకు కూడా నష్టం జరుగుతుందని యాజమాన్యం పేర్కొంది.
అయితే, ఆర్టీసీలోని మరో ప్రముఖ యూనియన్ అయిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMU) వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి మాత్రం సమ్మెకు తాము దూరంగా ఉంటున్నామని ప్రకటించారు. ప్రస్తుతం సమ్మెకు ఇది సరైన సమయం కాదని, తమ యూనియన్‌కు చెందిన కార్మికులు ఎప్పటిలాగే విధులకు హాజరవుతారని ఆయన తెలిపారు. జేఏసీ చైర్మన్ వెంకన్న సమ్మె నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
దీనికి ప్రతిస్పందనగా, జేఏసీ చైర్మన్ వెంకన్న సమ్మె విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అశ్వత్థామ రెడ్డి నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఇతర సంఘాలతో కాకుండా, సమ్మె నోటీసు ఇచ్చిన జేఏసీ నాయకులను పిలిచి చర్చలు జరిపి తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే సమ్మెపై పునరాలోచిస్తామని వెంకన్న డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇటీవల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌ నుంచి బస్‌భవన్‌ వరకు కవాతు నిర్వహించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube