కూకట్‌పల్లిలో కల్తీ మద్యం కల్లోలం – మృతుల సంఖ్య ఆరుకు చేరింది హైదరాబాద్, జూలై 9 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):హైదరాబాద్ కూకట్‌పల్లిలో కల్తీ మద్యం మృత్యు త
కూకట్‌పల్లిలో కల్తీ మద్యం కల్లోలం – మృతుల సంఖ్య ఆరుకు చేరింది
హైదరాబాద్, జూలై 9 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):
హైదరాబాద్ కూకట్‌పల్లిలో కల్తీ మద్యం మృత్యు తాండవం నడుపుతోంది. కల్తీ మద్యం సేవించడంతో మృతుల సంఖ్య ఆరుగురికి పెరిగింది. మృతుల్లో స్వరూప(56), తులసీరామ్(47), బొజ్జయ్య(55), నారాయణమ్మ(65), మౌనిక(25), నారాయణ ఉన్నారు. వీరంతా హెచ్ఎంటీ హిల్స్ ప్రాంతంలోని సాయిచరణ్ కాలనీ నివాసితులుగా గుర్తించారు.
ఇంకా పలువురు బాధితులు గాంధీ హాస్పిటల్, నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా, ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం తీవ్రంగా స్పందించి విచారణ కమిటీ వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ మద్యం వలన ఈ తరహా ఘోరాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .
COMMENTS