ప్రైవేట్ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడమే దేశంలో విద్యా సమానతకు మార్గమని ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు స్పష్టం చేశారు. ఆయన ఒక పౌరుడిగా రాసిన వ్యాసంల
ప్రైవేట్ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడమే దేశంలో విద్యా సమానతకు మార్గమని ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు స్పష్టం చేశారు. ఆయన ఒక పౌరుడిగా రాసిన వ్యాసంలో – “నాణ్యమైన విద్య అందాలంటే దేశవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్ని పూర్తిగా తొలగించాలి” అని చెప్పారు.
అప్పుడే సీఎం పిల్లలు, మంత్రుల మనుమలు, ధనికుల పిల్లలు, పేదవారి పిల్లలు అందరూ ప్రభుత్వ బడుల్లోనే చదవాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వ పాఠశాలల పనితీరు, సౌకర్యాలు, టీచర్ల క్రమశిక్షణ అన్నీ మెరుగుపడతాయి. ప్రభుత్వ పెద్దలు కూడా నిజంగా విద్య నాణ్యతపై శ్రద్ధ చూపుతారు.
ఒక జిల్లాలో కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయన చేసిన విశ్లేషణలో, ప్రైవేట్ పాఠశాలలో టీచర్లకు తక్కువ జీతం ఇచ్చినా విద్యార్థుల నాణ్యత “ఏ” గ్రేడ్‌లో ఉండగా, ప్రభుత్వ బడుల్లో ఎక్కువ ఖర్చు పెట్టినా విద్యార్థుల పనితీరు “సీ” గ్రేడ్‌కు పడిపోతోందని వెల్లడించారు.
ప్రస్తుత వ్యవస్థలో మద్దతులేని పేద కుటుంబాలే ప్రభుత్వ బడుల్లో చదివించాల్సిన అవసరంలో ఉన్నారు. మధ్య తరగతులు అప్పులు చేసి ప్రైవేట్ పాఠశాలల ఫీజులు చెల్లిస్తున్నారు. ఇది సమాజంలో విద్యా అసమానతను మరింత పెంచుతుంది.
అమెరికా, యూరప్ దేశాల్లోని “స్కూల్ డిస్ట్రిక్ట్” విధానాన్ని భారతదేశంలోనూ అమలు చేయాలని ఆకునూరి మురళి గారు సూచించారు. ఇంగ్లీషు మీడియాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని, అలాగే తల్లిదండ్రులు కూడా బడిప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండేలా చేయాలని చెప్పారు.
చైనాలో 1950లలో పెట్టిన బేసిక్ ఎడ్యుకేషన్‌పై పెట్టుబడి వల్లే ఆ దేశం అగ్రగామిగా మారిందని ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడమేకాదు, తల్లిదండ్రుల కమిటీలను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు ప్రత్యక్షంగా జవాబుదారీతనం కల్పిస్తేనే అసలు మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు.
విద్యను తాలూకు మౌలిక హక్కుగా తీర్చిదిద్దాలంటే ప్రైవేట్ విద్యావ్యవస్థను తొలగించి, ప్రభుత్వ పాఠశాలలనే కేంద్రంగా పెట్టి బలమైన విధానాలు రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. అలా జరిగితే బంగారు తెలంగాణ, బంగారు భారత్ కచ్చితంగా సాధ్యమవుతుందని ఆకునూరి మురళి గారు పేర్కొన్నారు.
COMMENTS