Rohit Sharma పాత ట్వీట్ వైరల్ – గిల్ వన్డే కెప్టెన్!

Rohit Sharma పాత ట్వీట్ వైరల్ – గిల్ వన్డే కెప్టెన్!

Homeస్పోర్ట్స్

Rohit Sharma పాత ట్వీట్ వైరల్ – గిల్ వన్డే కెప్టెన్!

భారత వన్డే క్రికెట్‌ లో కొత్త శకం ప్రారంభమైంది. రోహిత్ శర్మ సారథ్యానికి ముగింపు పలుకుతూ, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను టీమిండియా వన్డే కెప్టెన్‌గా నియమి

Donald Trump | హమాస్ కథ ముగించాలి – ఇజ్రాయెల్‌కు సూచనలు
ZPTC, MPTC ఎన్నికల నోటిఫికేషన్ విడుదల – తెలంగాణ
కార్గిల్‌ విజయానికి 26 ఏళ్లు: అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన భారత వాయుసేన.

భారత వన్డే క్రికెట్‌ లో కొత్త శకం ప్రారంభమైంది. రోహిత్ శర్మ సారథ్యానికి ముగింపు పలుకుతూ, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను టీమిండియా వన్డే కెప్టెన్‌గా నియమించారు. ఈ నిర్ణయం అభిమానుల్లోనే కాకుండా మాజీ ఆటగాళ్లలో కూడా చర్చనీయాంశమైంది. అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ ఈ ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచినా, యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించడం సరైనదేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇంతలోనే రోహిత్ శర్మ 13 ఏళ్ల కిందటి ట్వీట్ మళ్లీ వైరల్ అవుతోంది. 2012లో అతడు చేసిన ఒక ట్వీట్‌లో “ఒక అధ్యాయం (45) ముగిసింది, కొత్త శకం (77) ప్రారంభమైంది” అని రాశాడు. ఆ సమయంలో ఆ ట్వీట్‌ అర్థం ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తే ఆ నంబర్లు రోహిత్ (జెర్సీ 45) మరియు గిల్‌ (జెర్సీ 77) ను సూచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంటే రోహిత్ అప్పుడే గిల్ తన వారసుడిగా అవుతాడని హింట్ ఇచ్చాడన్న అభిప్రాయం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.

వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా 75 శాతం విజయాలు సాధించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కి ఆటగాడిగా మాత్రమే ఎంపికైన రోహిత్, తన కెరీర్ చివరి దశలోకి అడుగుపెడుతున్నాడు. మరోవైపు, యువ కెప్టెన్‌ గిల్‌ ఆధ్వర్యంలో జట్టు భవిష్యత్‌ ప్రణాళికలు బీసీసీఐ దృష్టిలో ఉన్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ నాటికి గిల్ జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక రోహిత్‌ ఫిట్‌నెస్‌, ఫామ్‌ ఆధారంగా అప్పటివరకు జట్టులో కొనసాగుతాడా లేదా అన్నది చూడాలి.

ప్రస్తుతం రోహిత్‌ పాత ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌ అవుతూ, “హిట్‌మ్యాన్‌ తన వారసుడిని అప్పుడే ఎంచుకున్నాడా?” అనే చర్చకు తెరలేపింది.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణలు, కామెంటరీ కోసం మా వెబ్‌సైట్ మరియు యూట్యూబ్ చానెల్‌ను ఫాలో అవ్వండి.

Visit: www.digitalprimenews.in

Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube