రామంతాపూర్‌లో ఉద్రిక్తత.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య హైదరాబాద్: రామంతాపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రథం విద్య
రామంతాపూర్‌లో ఉద్రిక్తత.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్: రామంతాపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రథం విద్యుత్ తీగకు తగలడంతో కరెంట్ షాక్‌కు గురై అనేకమంది కుప్పకూలారు. ఈ ఘటనలో మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది.
విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 11 కేవీ విద్యుత్ తీగ టీవీ కేబుల్ కండక్టర్ వైర్‌ను తాకడంతో టీవీ కేబుల్లో కూడా కరెంట్ పాస్ అవుతోందని తెలిపారు. ఆ కేబుల్ రథానికి తగిలి ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. తక్షణ చర్యగా అక్కడి తీగలను తొలగించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
స్థానికుల ఆగ్రహం – నిరసన
ఈ ఘటనకు కారణం విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేనంటూ కాలనీ వాసులు రోడ్డెక్కారు. రామంతాపూర్–ఉప్పల్ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అధికారులు బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు కనీసం ₹50 లక్షల పరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
“నిర్లక్ష్యం వహించిన విద్యుత్ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన కారణంగా రామంతాపూర్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ప్రభుత్వం స్పందన
ఈ ఘటనను ప్రభుత్వం గమనించి, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందేలా చూస్తామని విద్యుత్ శాఖ సీఎండీ తెలిపారు. రానున్న వినాయక చవితి, దసరా వేడుకల ముందు నగర వ్యాప్తంగా తీగల తనిఖీ, మరమ్మతులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణలు, కామెంటరీ కోసం మా వెబ్‌సైట్ మరియు యూట్యూబ్ చానెల్‌ను ఫాలో అవ్వండి.
Visit: www.digitalprimenews.in
Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
COMMENTS