ఏపీలో నేడు జనసేన పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆహ్వానంతో ఈ
ఏపీలో నేడు జనసేన పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆహ్వానంతో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ‘‘సుపరిపాలన ప్రారంభమై, ప్రజలపై పీడ విరగడై ఏడాది పూర్తయింది’’ అనే నినాదంతో జనసైనికులు పండగలా జరుపుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఉదయం రంగవల్లులు వేసి, సాయంత్రం టపాసులు కాల్చాలని పార్టీ కార్యాలయం నుంచి శ్రేణులకు సూచనలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యకమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది.
పార్టీ విజయంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, ఈ ఆనందోత్సవాలు పార్టీకి మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని నేతలు తెలిపారు.
COMMENTS