IND vs PAK: ఒక్క మాటతో పాక్ పరువుతీసిన సూర్య భాయ్! 2025 ఆసియా కప్ సూపర్ ఫోర్స్‌లో టీమ్ ఇండియా పాకిస్థాన్‌పై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆరు
IND vs PAK: ఒక్క మాటతో పాక్ పరువుతీసిన సూర్య భాయ్!
2025 ఆసియా కప్ సూపర్ ఫోర్స్‌లో టీమ్ ఇండియా పాకిస్థాన్‌పై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ పాకిస్థాన్‌ను అన్ని రంగాల్లో ఓడించింది. మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
రైవల్రీపై సూర్య షాక్ వ్యాఖ్యలు
మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ యాదవ్‌ను భారత్-పాక్ మధ్య రైవల్రీ గురించి ప్రశ్నించగా, ఆయన సూటిగా స్పందించాడు.
“రైవల్రీ అంటే సమాన శక్తుల మధ్య పోటీ ఉండాలి. కానీ ఇక్కడ 13-0, 10-1 రికార్డ్ ఉంది. ఇది రైవల్రీ కాదు… వన్‌వే ట్రాఫిక్!” అని సూర్య స్పష్టం చేశాడు.
ఈ ఒక్క మాటతోనే పాక్ పరువు తీసినట్టైంది. టీమ్ ఇండియా పాకిస్థాన్ కంటే మెరుగైన క్రికెట్ ఆడుతోందని ఆయన ధీమాగా చెప్పారు.
మ్యాచ్ హైలైట్స్
పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ 58 పరుగులతో మెరుగైన ఆట ప్రదర్శించాడు. భారత బౌలర్లలో శివమ్ దుబే 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.
తర్వాత 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత ఓపెనర్లు అద్భుత ఆరంభం అందించారు. అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు) కొట్టగా, గిల్ 28 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ 26 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్‌ను గెలిపించారు.
భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది
భారత్-పాక్ పోటీల్లో గత కొన్నేళ్లుగా టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యం చాటుకుంటోంది. ఆసియా కప్‌లోనూ అదే రీతిలో కొనసాగిస్తూ సూర్య సేన మరోసారి పాక్‌ను సులభంగా ఓడించింది. సూర్యకుమార్ వ్యాఖ్యలు ఈ జట్ల మధ్య ఉన్న అసలు పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి.

COMMENTS