కార్యకర్తనే బలిగొన్న కాంగ్రెస్ నేతలు: ‘ఇందిరమ్మ ఇల్లు’ అడిగినందుకు యువకుడి ఆత్మహత్య ములుగు జిల్లా, జూలై 8 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):ఇందిరమ్మ ఇల్లు కా
కార్యకర్తనే బలిగొన్న కాంగ్రెస్ నేతలు: ‘ఇందిరమ్మ ఇల్లు’ అడిగినందుకు యువకుడి ఆత్మహత్య
ములుగు జిల్లా, జూలై 8 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):ఇందిరమ్మ ఇల్లు కావాలనే కోరినందుకు కాంగ్రెస్ కార్యకర్తే తన జీవితాన్ని కోల్పోయాడు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేశ్ (29), మంత్రి సీతక్క నియోజకవర్గంలో అధికారం కదలికల పేరుతో ఎదురైన బెదిరింపులు, అన్యాయాలతో మనోవేదనలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం రేపింది.
ఎలా మొదలైంది ఈ దారుణం?
రమేశ్ పేరు ఇందిరమ్మ ఇండ్ల తొలి జాబితాలో ఉండగా, రెండో జాబితాలో తొలగించడంతో అసంతృప్తికి లోనయ్యాడు. సోషల్ మీడియాలో కార్యకలాపాలు కొనసాగిస్తూ, “నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే. నాకు న్యాయం కావాలి” అంటూ పోస్టులు పెట్టాడు. కానీ, ఈ పోరాటమే చివరికి ఆయనే పార్టీ నాయకుల చేతిలో బలవ్వడానికి దారితీసింది.
నేతల బెదిరింపులు, పోలీసుల పీడన
సోషల్ మీడియాలో ఆరోపణలు చేసినందుకు స్థానిక కాంగ్రెస్ నేతలు, పోలీసులు కలిసి రమేశ్‌ను బెదిరించారు. సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం, పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం జరిగింది. రాత్రికి రాత్రే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గ్రామస్తుల ఆందోళన – జాతీయ రహదారిపై ధర్నా
రమేశ్ మృతదేహంతో గ్రామస్థులు జాతీయ రహదారి (నెం.168)పై మూడు గంటల పాటు ధర్నా చేశారు. “ఇందిరమ్మ ఇల్లు అడిగినంత మాత్రాన ఓ అనాథ యువకుడిని ఇలా మానసికంగా కుంగదీస్తారా?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్, గ్రామస్తుల స్పందన
టీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హత్యకు ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసుల స్పందన
చుక్క రమేశ్ అమ్మమ్మ శెట్టి విశాల ఫిర్యాదు మేరకు పలువురిపై కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ రవీందర్ తెలిపారు. చల్వాయి సమాచారం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పై కూడా విచారణ కొనసాగుతోందని చెప్పారు.
Digital Prime News స్పెషల్ రిపోర్ట్:
ఈ దారుణ ఘటన ప్రభుత్వ వ్యవస్థల విఫలతకే నిదర్శనం. ఇల్లు అడిగినందుకు కార్యకర్తే ప్రాణాలు కోల్పోయిన దారుణం పై సమగ్ర దర్యాప్తు అవసరం.
Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .
COMMENTS