సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా–గోదావరి జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వార్. అసెంబ్లీ రాజకీయ వేడి పీక్స్‌కు. Congress vs BRS,
సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా–గోదావరి జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వార్. అసెంబ్లీ రాజకీయ వేడి పీక్స్‌కు.
Congress vs BRS, PPT War: తెలంగాణ రాజకీయాలు మరో కొత్త దశకు చేరాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) వార్‌గా మారింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ప్రజెంటేషన్లతో రాజకీయ వేడి పీక్స్‌కు చేరింది. సాగునీటి ప్రాజెక్టులు, నదీజలాల పంపకం, ఖర్చులు, అవకతవకల అంశాలే అస్త్రాలుగా ఈ పోరు సాగుతోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగంలో జరిగిన అక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సిద్ధమైంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, అదనపు వ్యయంపై పక్కా ఆధారాలతో ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శాసనసభలో భారీ స్క్రీన్ల ఏర్పాటు కూడా చేస్తోంది.
కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య సాగుతున్న వాటర్ వార్ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ యుద్ధంగా మారింది. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు మారణశాసనం రాశారని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీపడలేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్, కృష్ణా–గోదావరి జలాల పంపకం, కేంద్రంతో జరిగిన చర్చలు, అప్పటి నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివరంగా ప్రజెంటేషన్ ఇవ్వనుంది.
ఈ ప్రజెంటేషన్‌లో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా, గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలు, తెలంగాణకు జరిగిన నష్టం అంశాలను ఆయన వివరించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నదీజలాలపై మాట్లాడనున్నారు.
మరోవైపు, అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్, ప్రభుత్వానికి కౌంటర్‌గా తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ తమ పాలనలో చేసిన అభివృద్ధి, నదీజలాలపై తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందుకు తీసుకురానుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ PPT వార్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో, ఎలాంటి సంచలన విషయాలు బయటపడతాయోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS