AP Google Agreement: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందంఢిల్లీ: గూగుల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్
AP Google Agreement: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం
ఢిల్లీ: గూగుల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీనిలో భాగంగా విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ స్థాపనకు దారితీసే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 2029 నాటికి పూర్తి స్థాయిలో ఈ డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
గూగుల్ సంస్థ రూ.87,520 కోట్ల భారీ పెట్టుబడితో ఒక గిగా వాట్ కెపాసిటీ కలిగిన ఆధునిక ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్ ద్వారా వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు వంటి విభిన్న రంగాలకు సాంకేతిక సేవలు అందించనుంది. విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో సబ్ సీ కేబుల్ ద్వారా గ్లోబల్ కనెక్టివిటీ అందించనుంది.
ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ, “విశాఖ గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా అవతరించనుంది. అమెరికా వెలుపల గూగుల్ ఇంత భారీ పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. ఈ సెంటర్ ద్వారా జెమినీ-ఏఐతో పాటు గూగుల్ అందించే అన్ని క్లౌడ్ సేవలు లభ్యమవుతాయి” అని తెలిపారు.
అదనంగా ఆయన, “వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. విశాఖ నుంచి భారత్‌తో పాటు అనేక దేశాలకు కనెక్టివిటీ ఇవ్వబోతున్నాం” అని పేర్కొన్నారు.
COMMENTS