తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 | ఫ్యూచర్ సిటీ పెట్టుబడుల వేదిక

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 | ఫ్యూచర్ సిటీ పెట్టుబడుల వేదిక

Homeతెలంగాణఅంతర్జాతీయం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 | ఫ్యూచర్ సిటీ పెట్టుబడుల వేదిక

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. Telangana Rising Global Summ

కేటీఆర్ షేర్ చేసిన కేసీఆర్ ఫోటో వైరల్ | తెలంగాణ రాజకీయాల్లో చర్చ
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు.. కీలక బాధ్యతలపై సీఎం ఫోకస్!
నల్లగొండకు సీఎం రేవంత్.. రూ.13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు.

Telangana Rising Global Summit 2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ముచెర్లలో అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ వేదికగా మారింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో భారీ ఏర్పాట్లు చేసింది. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.

సదస్సు మొదటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారికంగా సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. అంతకుముందు మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకుని గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం ప్రారంభోత్సవ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, వివిధ రంగాల్లో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నారు.

అలాగే, తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వ విజన్, భవిష్యత్ ప్రణాళికలను దేశీ విదేశీ ప్రతినిధులకు వివరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, టాప్ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు కలిపి దాదాపు 3 వేల మంది ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు.

ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో వన్ టు వన్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రతి 15 నిమిషాల చొప్పున జరిగే ఈ సమావేశాల ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక విస్తరణపై చర్చ జరుగనుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సుమారు 15 కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈ సమావేశాల్లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా, అమెజాన్, ఐకియా, టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ రంగాల ప్రతినిధులు పాల్గొననున్నారు. అలాగే వరల్డ్ బ్యాంక్, SIDBI, వెస్ట్రన్ యూనియన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ సంస్థలు, వివిధ దేశాల రాయబారులతో కూడా సీఎం సమావేశమవుతారు. రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందుతో తొలి రోజు సమ్మిట్ ముగియనుంది.

https://youtube.com/shorts/-ikEULS_HgM?feature=share

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube