కుత్బుల్లాపూర్ పూర్ణిమ స్కూల్ సీజ్ – చిన్నారి దాడి కలకలం

కుత్బుల్లాపూర్ పూర్ణిమ స్కూల్ సీజ్ – చిన్నారి దాడి కలకలం.

Homeతెలంగాణ

కుత్బుల్లాపూర్ పూర్ణిమ స్కూల్ సీజ్ – చిన్నారి దాడి కలకలం.

కుత్బుల్లాపూర్ పూర్ణిమ స్కూల్‌లో చిన్నారి దాడి కలకలం. అధికారులు స్కూల్‌ను సీజ్ చేసి, నిందితురాలిపై కేసు నమోదు చేశారు. విద్యార్థుల భద్రతపై చర్యలు. Chi

జేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు…..
హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. నేడు పాతబస్తీలో భారీ ఆంక్షలు!
HYDలో SUMMER క్యాంప్.. బుక్ చేయండి! 

కుత్బుల్లాపూర్ పూర్ణిమ స్కూల్‌లో చిన్నారి దాడి కలకలం. అధికారులు స్కూల్‌ను సీజ్ చేసి, నిందితురాలిపై కేసు నమోదు చేశారు. విద్యార్థుల భద్రతపై చర్యలు.

Child Assault Case, Quthbullapur News: కుత్బుల్లాపూర్‌లోని షాపూర్‌నగర్ పూర్ణిమ హైస్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన విచక్షణారహిత దాడి ఘటన పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నది. చిన్నారి పై ఆయా లక్ష్మి చేసిన కర్కశ దాడి వీడియో బయటకు రావడంతో తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమారి, మండల విద్యాశాఖాధికారి జెమిని, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశం, హ్యూమన్ రైట్స్ చైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధులు కలిసి సోమవారం ఉదయం స్కూల్‌ను సీజ్ చేయడం ద్వారా ఘటనపై విచారణను వేగవంతం చేశారు.

నిందితురాలు లక్ష్మిపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే పిర్యాదు నమోదై ఉంది. ఆమెను విచారించే ప్రక్రియ కొనసాగుతుండగా, అధికారుల ప్రాథమిక దర్యాప్తులో చిన్నారిపై దాడి జరిగిన విషయాన్ని నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలో చదువుతున్న 70 మంది పదో తరగతి విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వారిని మరో స్కూల్‌కు పంపించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో డిసెంబర్ 3న ఉదయం 10.30కి సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలను నిర్ణయించాలని ఎంఈవో జెమిని తెలిపారు.

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు కలిసి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నారు. దాడిలో పాల్గొన్న ఆయాపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, స్కూల్ నిర్వహణపై కూడా బాధ్యతలు నిర్ధారించాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారని సమాచారం. ఇప్పటికే చిన్నారిపై జరిగిన దాడి హేయమైన చర్య అని ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి ఘటనలు విద్యాసంస్థల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పాఠశాలలో ఇదివరకూ కూడా ఆయా లక్ష్మి కొందరు విద్యార్థులపై దాడి చేసిన సంఘటనలు జరిగినట్లు యాజమాన్య దృష్టికి తీసుకువచ్చినా స్పందన లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థుల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి తీవ్ర మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు.

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో యూఎస్‌ఎఫ్‌ఐతో పాటు బీఆర్‌ఎస్ నేత లక్ష్మీనారాయణ ఇతర విద్యార్థి సంఘాల నేతలతో కలిసి ఫిర్యాదు చేస్తూ ఈ ఘటనలో స్కూల్ నిర్వహణ బాధ్యత వహించాలనీ, ఇలాంటి స్కూళ్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని వారు పునరుద్ఘాటించారు.

ప్రస్తుతం స్కూల్‌ను అధికారులు సీజ్ చేయడం, నిందితురాలిపై కేసు నమోదు కావడం, విద్యార్థులను ఇతర పాఠశాలలకు మార్చే ప్రక్రియ ప్రారంభించడం వంటి చర్యలు తీసుకోవడంతో తల్లిదండ్రులు కొంతవరకు నెమ్మది చెందుతున్నారు. కానీ చిన్నారులపై ఇలాంటి దారుణ ఘటనలు చోటుచేసుకోకుండా పాఠశాలల్లో పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలపర్చాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం, విద్యాశాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా సంస్కరణలను తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube