పాక్-ఆఫ్గాన్ యుద్ధం.. ట్రెండింగ్‌లో 93000.. అసలేంటీ నంబర్, భారత్‌తో సంబంధం ఏంటి? పాకిస్తాన్-ఆఫ్గానిస్థాన్ సరిహద్దు ఘర్షణల తర్వాత సోషల్ మీడియాలో “9300
పాక్-ఆఫ్గాన్ యుద్ధం.. ట్రెండింగ్‌లో 93000.. అసలేంటీ నంబర్, భారత్‌తో సంబంధం ఏంటి?
పాకిస్తాన్-ఆఫ్గానిస్థాన్ సరిహద్దు ఘర్షణల తర్వాత సోషల్ మీడియాలో “93000” అనే సంఖ్య వైరల్‌గా మారింది. పాక్ సైనికులు పారిపోయిన దృశ్యాలను ఆఫ్గాన్ దళాలు ప్రదర్శించగా, నెటిజన్లు దీన్ని 1971 భారత్-పాక్ యుద్ధంతో పోలుస్తున్నారు.
1971లో పాకిస్తాన్ 93 వేల మంది సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోయారు. అదే సంఖ్యను ఇప్పుడు ఆఫ్గాన్ యాక్టివిస్టులు “93000 Pants Ceremony 2.0”గా ట్యాగ్ చేస్తున్నారు. ఇది పాక్‌కు ఆ కాలంలోని అవమానాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది.
సమీప కాలంలో పాక్-ఆఫ్గాన్ సరిహద్దులో తీవ్రమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత పరిస్థితి కొంత సద్దుమణిగినా, సోషల్ మీడియాలో మాత్రం “93000” అనే ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. పాక్ నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాంకులు, సైనిక దుస్తులు ప్రదర్శించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
93,000 అంటే ఏంటి?
ఈ సంఖ్యకు మూలం 1971 డిసెంబర్‌లో జరిగిన చారిత్రక భారత్-పాక్ యుద్ధం. భారత లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా సమక్షంలో పాక్ లెఫ్టినెంట్ జనరల్ ఆమిర్ అబ్దుల్లా నియాజీ లొంగుబాటు పత్రాలపై సంతకం చేశారు. ఈ క్షణంలో ఏకంగా 93,000 మంది పాక్ సైనికులు లొంగిపోయారు — రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైనిక లొంగుబాటు.
ప్రస్తుతం ఆఫ్గాన్ దళాల ముందు పాక్ సైనికులు వెనక్కి తగ్గిన ఘటనను అదే చరిత్రతో పోలుస్తూ నెటిజన్లు “Team 93000” అని వ్యంగ్యంగా పిలుస్తున్నారు.
సోషల్ మీడియాలో పాక్‌కు అవమానం
ఒక ఆఫ్గాన్ కార్యకర్త ఎక్స్‌లో “1971లో భారత్‌కు లొంగిపోయారు, 2025లో ఆఫ్గాన్‌లకు లొంగిపోయారు — టీమ్ 93000 ఎప్పటికీ మారదు” అంటూ పోస్ట్ చేశారు.
భారత సైనిక వెటరన్ కన్వల్ జీత్ సింగ్ ధిల్లాన్ కూడా 1971 లొంగుబాటు ఫోటోను షేర్ చేస్తూ “93,000 — ఎల్లప్పుడూ నా ఇష్టమైన సంఖ్య” అని వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ మాత్రం ఈ ఘర్షణ వెనుక భారత్ చేతి ఉందని ఆరోపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో “93000” ట్రోల్‌లు ఇస్లామాబాద్‌కు మానసిక పరాజయాన్ని మిగిల్చాయి.

COMMENTS