ఘోర పతనంతో బంగ్లాదేశ్ ఓటమి.. వన్డే చరిత్రలో చెత్త రికార్డ్ నమోదు!

ఘోర పతనంతో బంగ్లాదేశ్ ఓటమి.. వన్డే చరిత్రలో చెత్త రికార్డ్ నమోదు!

Homeస్పోర్ట్స్Uncategorized

ఘోర పతనంతో బంగ్లాదేశ్ ఓటమి.. వన్డే చరిత్రలో చెత్త రికార్డ్ నమోదు!

 మ్యాచ్ స్థలం: కొలంబో |  తేదీ: 3 జూలై 2025 |  ప్రచురణ: Digital Prime News ఘోర పతనంతో బంగ్లాదేశ్ ఓటమి.. వన్డే చరిత్రలో చెత్త రికార్డ్ నమోదు! బంగ్లాదే

ఇంగ్లండ్ విజయం – 5 వికెట్లతో భారత్‌పై గెలుపు, 1-0 ఆధిక్యం.
మ్యాచ్ ఓడిపోయింది ఇక్కడే.. టీమిండియా కొంపముంచింది వీళ్లే!
అడ్లూరి లక్ష్మణ్ ఫిర్యాదు: మంత్రి పొన్నంపై కాంగ్రెస్ కలకలం

 మ్యాచ్ స్థలం: కొలంబో |  తేదీ: 3 జూలై 2025 |  ప్రచురణ: Digital Prime News

ఘోర పతనంతో బంగ్లాదేశ్ ఓటమి.. వన్డే చరిత్రలో చెత్త రికార్డ్ నమోదు!

బంగ్లాదేశ్ మరోసారి దారుణంగా విఫలమైంది. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో విజయం ముంగిట నిలిచి ఓటమిని మూటగట్టుకుంది. 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా, ఒక దశలో 100/1తో విజయానికి బలమైన స్థితిలో కనిపించింది. అయితే కేవలం 5 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోయి సంచలనాత్మకంగా కుప్పకూలింది.

ఘోర పతనానికి తెరతీశారు

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో జేకర్ అలీ 51 పరుగులు చేసి రాణించినప్పటికీ మిగతా ఆటగాళ్లు తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు చేరారు. 100/1 నుండి 105/8కి కుప్పకూలిన బంగ్లా.. చివరికి 167 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విధంగా 2వ వికెట్‌ నుంచి 8వ వికెట్‌ వరకూ అత్యల్ప స్కోరులో 7 వికెట్లు కోల్పోయిన టీమ్‌గా బంగ్లా చెత్త రికార్డ్ నమోదు చేసుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు యుఎస్‌ఏ పేరిట ఉండేది. వారు 2024లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే.

శ్రీలంక ఇన్నింగ్స్ విశేషాలు

మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులు చేసింది. కెప్టెన్ చరిత్ అసలంక తన బాటింగ్ టాలెంట్‌ను మరోసారి చూపించి 106 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. కుశాల్ మెండీస్ 45 పరుగులతో మద్దతిచ్చాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4 వికెట్లు తీయగా, మరికొంతమంది మోస్తరుగా బౌలింగ్ చేశారు.

హసరంగా మ్యాజిక్

లక్ష్యాన్ని వెంబడించే సమయంలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా మ్యాజిక్ చేశాడు. అతను 8 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ దెబ్బకి బంగ్లా పతనం ప్రారంభమైంది. హసరంగా అద్భుత ప్రదర్శనతో మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కెప్టెన్ అసలంక సొంతం చేసుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

 

https://x.com/ESPNcricinfo/status/1940451666626589179

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube