“Salute to Mother” Scheme Empowers Every Child in AP

తల్లికి వందనం: ప్రతి పిల్లకూ లబ్ధి – సీఎం చంద్రబాబు….

Homeజాబ్స్ & ఎడ్యుకేషన

తల్లికి వందనం: ప్రతి పిల్లకూ లబ్ధి – సీఎం చంద్రబాబు….

తల్లికి వందనం పథకం అమలు: ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ లబ్ధి - సీఎం చంద్రబాబు. ఉండవల్లి, జూన్ 13: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి

ఎచ్చెర్లలో దారుణ హత్య: ద్విచక్రవాహనంపై వెళ్తున్న గోపిపై కిరాతక దాడి
సీఎంల రాఖీ శుభాకాంక్షలు ఆడపడుచులకు
ఎన్టీఆర్‌ను చూసి భయపడుతున్నారా? అంబటి సెటైర్

తల్లికి వందనం పథకం అమలు: ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ లబ్ధి – సీఎం చంద్రబాబు.
ఉండవల్లి, జూన్ 13:
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించారు.
“ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకున్నాం,” అని సీఎం అన్నారు.
విద్యార్ధులకు భారీ మద్దతు:
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్ధులకు రూ.10,091 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి, మిగిలిన మొత్తం విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
అమలు తీరులో పారదర్శకత:
లబ్ధిదారుల జాబితా గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు.
దరఖాస్తుల నిమిత్తం ఈ నెల 26 వరకు గడువు,
జూన్ 30న తుది జాబితా విడుదల.
గత ప్రభుత్వంతో పోలిస్తే:
గత ప్రభుత్వం అమలు చేసిన ‘అమ్మఒడి’ పథకంతో పోలిస్తే 24.65 లక్షల మందికి ఎక్కువ మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
గత ప్రభుత్వం రూ.5,540 కోట్లు ఖర్చు చేయగా, నేటి ప్రభుత్వం రూ.8,745 కోట్లు ఖర్చు చేస్తోంది – అంటే రూ.3,205 కోట్లు అదనంగా వెచ్చింపు.
తల్లి లేకపోతే కూడా లబ్ధి:
తల్లి లేకపోతే తండ్రికి లేదా సంరక్షకుడికి, అనాథ విద్యార్ధులకు కలెక్టర్ నిర్ణయించిన వారికీ డబ్బులు జమ చేస్తామని సీఎం తెలిపారు. ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ పాఠశాలలలో చదువుతున్న 76,000 మంది విద్యార్ధులకు కూడా పథకం వర్తిస్తుంది.
లబ్ధిదారుల వివరాలు:
బీసీలు – 29.82 లక్షలు
ఎస్సీలు – 11.76 లక్షలు
ఎస్టీలు – 4.26 లక్షలు
ఈడబ్ల్యూసీలు – 8.44 లక్షలు
మైనార్టీలు – 66,500 మంది
కుటుంబాల వారీగా:
ఒక బిడ్డ ఉన్న కుటుంబాలు – 18.55 లక్షలు
ఇద్దరు బిడ్డల కుటుంబాలు – 29.10 లక్షలు
ముగ్గురు పిల్లలు ఉన్నవారు – 6.32 లక్షలు
నలుగురు పిల్లల తల్లులు – 80,212 మంది

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube