క్రికెట్‌లో వీడ్కోలుల వరస! - Digital Prime News - Latest Telugu News Digital Prime News

క్రికెట్‌లో వీడ్కోలుల వరస!

Homeస్పోర్ట్స్

క్రికెట్‌లో వీడ్కోలుల వరస!

2025.. క్రికెట్ అభిమానుల హృదయాలను కలిచివేసే సంవత్సరం కావొచ్చని స్పష్టమవుతోంది. ఈ ఏడాది అనేకమంది ప్రముఖ క్రికెటర్లు ఒకదానికొకరు వీడ్కోలు పలుకుతున్నారు.

భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్: భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు
చరిత్ర సృష్టించిన హిట్మ్యాన్…
త్రివిధ దళాల నిర్ణయాలతో గర్విస్తున్నా: రోహిత్… 

2025.. క్రికెట్ అభిమానుల హృదయాలను కలిచివేసే సంవత్సరం కావొచ్చని స్పష్టమవుతోంది. ఈ ఏడాది అనేకమంది ప్రముఖ క్రికెటర్లు ఒకదానికొకరు వీడ్కోలు పలుకుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు మొత్తం 15 మంది ప్రముఖ ఆటగాళ్లు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ తమ రిటైర్‌మెంట్ ప్రకటించారు.
ఇది ‘రిటైర్‌మెంట్ ఇయర్’ అనే పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందులో భాగంగా భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలు టెస్టు మరియు టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెబితే, ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, స్టీవ్ స్మిత్‌, మార్కస్ స్టోయినిస్ వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇక దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్, వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ మాత్రం అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతూ అభిమానులను ఆశ్చర్యపరిచారు.
ఈ వీడ్కోలు ప్రకటనలతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా శూన్యంగా అనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా తమ ఆటతో అభిమానులను అలరించిన స్టార్ ప్లేయర్లు ఒకరి తర్వాత మరొకరు క్రికెట్ మైదానాలకు గుడ్‌బై చెబుతుండటం బాధను కలిగించకమానదు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్థాయిలో ఒకేసారి రిటైర్‌మెంట్లు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఆటగాళ్లు తమ భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ఫామ్, ఫిట్‌నెస్, కొత్త తరానికి అవకాశాలివ్వాలన్న ఉద్దేశంతో వీడ్కోలు నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే వీరి సేవల్ని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube