నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో ప్రేమజంటపై బంధువుల దాడి…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో ప్రేమజంటపై బంధువుల దాడి….

Homeతెలంగాణ

నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో ప్రేమజంటపై బంధువుల దాడి….

వరంగల్, జూన్ 5: తెలంగాణలో ప్రేమ వివాహాలపై మానవ సంబంధాల్ని చెరిపేస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్ట

త్వరలో 12 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ? 
HYD: సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తం: సజ్జనార్…
ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా.. హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ఐసిస్‌ కుట్ర?

వరంగల్, జూన్ 5:
తెలంగాణలో ప్రేమ వివాహాలపై మానవ సంబంధాల్ని చెరిపేస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ బుధవారం సాయంత్రం ఉద్రిక్తతల కేకలతో మారుమోగింది. శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన మణిరాజ్ అనే యువకుడు, నితీష అనే యువతిని ప్రేమ వివాహం చేసుకోవడం ఈ కల్లోలానికి కారణమైంది.
వారిద్దరూ వారం క్రితం మేజర్లుగా ఉండి పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం వారు శనిగరం గ్రామానికి చెందిన సముద్రాల బాలరాజు ఇంట్లో తలదాచుకున్నారు. కానీ ఈ విషయం తెలిసిన యువతి బంధువులు సుమారు 50 మందితో ఆ గ్రామానికి చేరుకొని, యువతిని బలవంతంగా తీసుకెళ్లేందుకు యత్నించారు.
అందుకు భయపడి ప్రేమజంట నేరుగా నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులను ఆశ్రయించింది. కానీ అక్కడే మళ్లీ ఊహించని విధంగా వివాదం ముదిరింది. కౌన్సిలింగ్ కొనసాగుతున్న సమయంలో యువతి బంధువులు స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి, ప్రేమజంటపై దాడికి దిగారు. యువకుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. యువతిని బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు జోక్యం చేసుకుని జంటను రక్షించారు. దాడికి పాల్పడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇద్దరూ మేజర్లే కావడంతో, వారి మధ్య వివాహం చట్టబద్ధమేనని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం ప్రేమజంటకు కౌన్సిలింగ్ ఇచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఈ ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదులు మేరకు పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. కులాంతర వివాహం కారణంగా ఇంతటి ఉద్రిక్తతలు నెలకొనడం దురదృష్టకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమను గౌరవించాల్సిన సమాజం, కుటుంబాలే అణచివేయడం బాధాకరమని సామాజిక న్యాయ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube