బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల వర్షాలు. అమరావతి, మే 27: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల వర్షాలు.
అమరావతి, మే 27:
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కునికి గంటకు 50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రైతులు, మత్స్యకారులు, తక్కువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
websoft Technologies – youtube video

COMMENTS