చంద్రబాబు కీలక ఆదేశాలు: తల్లికి వందనం పథకం ఒకే విడతలో అమలు, పథకాలకు వార్షిక క్యాలెండర్ సిద్ధం చేయాలన్న సీఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు
చంద్రబాబు కీలక ఆదేశాలు: తల్లికి వందనం పథకం ఒకే విడతలో అమలు, పథకాలకు వార్షిక క్యాలెండర్ సిద్ధం చేయాలన్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై పూర్తి దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ నెలలోపు “తల్లికి వందనం” పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మంత్రుల నుంచి రెండు విడతలుగా అమలు చేయాలన్న సూచన వచ్చినా, చంద్రబాబు మాత్రం ఈ డబ్బులను ఒకే విడతలో తల్లుల ఖాతాల్లో జమ చేయాలని తేల్చి చెప్పారు.
ఇంతటి ఆర్థిక సవాళ్ల మధ్య ప్రజలకు నమ్మకం కలిగించేలా సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమావేశంలో ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలపై కూడా చర్చ జరిగింది. మంత్రులు ప్రజల్లోకి వెళ్లి లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, వారి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. సూపర్ సిక్స్ పథకంలో ఇప్పటికే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్టు తెలిపారు.
మద్యం కుంభకోణంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మంత్రి మండలికి చంద్రబాబు స్పష్టమైన సూచన చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, అధికారపక్షం నుండి ఎలాంటి స్పందన వచ్చినా దర్యాప్తుపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.
websoft – DP Infra Marketing instagram post
COMMENTS