సెప్టెంబర్ 28-30 తేదీల్లో జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. ఐబీఏతో చర్చల అనంతరం యూఎఫ్‌బీయూ నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో
సెప్టెంబర్ 28-30 తేదీల్లో జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. ఐబీఏతో చర్చల అనంతరం యూఎఫ్‌బీయూ నిర్ణయం తీసుకుంది.
చివరి నిమిషంలో వాయిదా పడింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య జరిగిన చర్చల అనంతరం సమ్మెను వాయిదా వేస్తున్నట్లు UFBU ప్రకటించింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల శాఖలు సెప్టెంబర్ 28 నుంచి సాధారణంగా పనిచేయనున్నాయి.
వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని, ఉద్యోగుల పని భారం తగ్గించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. మిగిలిన శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించి సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేసే విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
ఐబీఏ, యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో ఐదు రోజుల పని విధానంపై చర్చించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించి, బ్యాంకు ఉద్యోగులు, యాజమాన్యాలు, వినియోగదారులతో పాటు సంబంధిత వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని గుర్తించనుంది.
అదేవిధంగా స్కేల్-4, అంతకంటే ఉన్నత స్థాయి అధికారులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI)లో మార్పులపై కూడా ఐబీఏతో చర్చలు ప్రారంభించనున్నట్లు UFBU తెలిపింది. పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాలపై కూడా ఇరు వర్గాలు చర్చించి త్వరితగతిన పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయనున్నాయి. ఈ చర్చల నేపథ్యంలో ప్రతిపాదిత సమ్మెను వాయిదా వేసినట్లు యూనియన్లు వెల్లడించాయి.
మరోవైపు అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’ నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) ప్రకటించింది. ఆ రోజున దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ రిటైల్ దుకాణాల్లో UPI చెల్లింపులను స్వీకరించకుండా నిరసన చేపట్టాలని నిర్ణయించింది. ఇతర రిటైల్ వాణిజ్య సంఘాలు కూడా ఈ నిరసనకు మద్దతు ప్రకటించినట్లు సమాచారం.
రూ.2,000కు మించిన మర్చంట్ UPI లావాదేవీలపై 0.4 శాతం MDR విధానాన్ని వ్యతిరేకిస్తూ AIMRA ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ ఛార్జీ అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంటూ, దానికి వ్యతిరేకంగా అక్టోబర్ 2న రిటైలర్లు తమ దుకాణాల్లోని UPI QR కోడ్‌లపై నల్లటి వస్త్రం కప్పి నిరసన తెలియజేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
SIR వివాదంపై ఈసీ వివరణ ఇవ్వాలి.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్
సింగూరులో డేంజర్ బెల్స్.. అడుగంటిన జలాశయం, తాగునీటికి ముప్పు
కేంద్ర కులగణనలో బీసీల లెక్క చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Instagram: DigitalPrimeNews
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews

COMMENTS