రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్
రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా, రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో, ప్రజలు అత్యవసరమైతే తప్ప పగటి వేళల్లో బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో గత మూడు రోజుల్లోనే 19 మంది వడదెబ్బ తగిలి మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
COMMENTS