అసెంబ్లీలో రచ్చ.. కేటీఆర్, హరీష్ రావు సస్పెండ్

అసెంబ్లీలో రచ్చ.. కేటీఆర్, హరీష్ రావు సస్పెండ్

Homeతెలంగాణ

అసెంబ్లీలో రచ్చ.. కేటీఆర్, హరీష్ రావు సస్పెండ్

తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆక్స్‌ఫర్డ్ ఆహ్వానం….
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్‌….
ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ ఫైర్.. రైతుల ప్రాణాలు పోతున్నాయ్

తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్

తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ సభలో ఆందోళనకు దిగారు. గన్‌పార్క్ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి చేరుకున్నారు. సభలో ఉదయం నుంచే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన సభలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. కౌశిక్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ సభ్యులు సభా సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బీఆర్ఎస్ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ చర్చలు జరగకుండా ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు హాజరు కావడం లేదని విమర్శించారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయరని స్పష్టం చేశారు.

ఈ పరిణామాల మధ్య శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సభ్యులతో కలిసి వందల ఎకరాల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. దీనిపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హరీష్ రావు నిజాయితీగా ఉంటే విచారణకు సహకరించాలని సవాల్ విసిరారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలువేగంగా అందించే Digital Prime News‌ తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube